Fake Premium liquor : ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ - హైదరాబాద్‌లో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి అమ్ముతున్న ముఠాను తెలంగాణ ఎక్సైజ్ శాఖ పట్టుకుంది. శంషాబాద్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసి నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మంది కోసం గాలిస్తున్నారు.

Published on: Nov 18, 2026, 13:33:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి, ఎక్కువ ధరలకు అమ్ముతున్న నకిలీ మద్యం ముఠా గుట్టును తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రట్టు చేసింది. ఈ దందాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లోని సతంరాయ్ ప్రాంతంలో ఉన్న ఒక నివాసంపై ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి, ఈ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టారు.

హైదరాబాద్‌లో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు
హైదరాబాద్‌లో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

మాజీ డిస్టిలరీనే సూత్రధారి….

ఈ కేసులో ప్రధాన నిందితుడైన వి. అశోక్ గతంలో ఒక డిస్టిలరీలో కార్మికుడిగా పనిచేశాడు. ఆ అనుభవంతో అశోక్ తన నివాసంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతడి ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ బృందం, చీప్ లిక్కర్‌తో నింపిన 10 ఖరీదైన బ్రాండ్ బాటిళ్లను, అలాగే ప్రీమియం బ్రాండ్లను పోలి ఉన్న 30 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.

"ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో ఈ ముఠా గుట్టును పూర్తిగా రట్టు చేశాము. క్యాబ్ డ్రైవర్ ముసుగులో చీప్ లిక్కర్‌ను సరఫరా చేస్తున్న వ్యక్తిని గ్రేటర్ హైదరాబాద్ డీటీఎఫ్ ) బృందం పట్టుకుంది" అని ఎక్సైజ్ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

నిందితుడు అశోక్, మహమ్మద్ యాకుబ్ పాషా (29) అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ యార్డ్ (పాత సామాన్ల దుకాణం) నుంచి ఖరీదైన మద్యం ఖాళీ బాటిళ్లను సేకరించేవాడని విచారణలో తేలింది. ఆ ఖాళీ బాటిళ్లలో కేవలం రూ. 560 ధర పలికే తక్కువ రకం మద్యాన్ని నింపి…. సీల్ వేసి అసలు బ్రాండ్ల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఖాళీ బాటిళ్లు సరఫరా చేస్తున్న పాషాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ దందాతో సంబంధం ఉన్న మరో 10 మందిని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. పరారీలో ఉన్న వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More