TG BSc Forestry Admissions : బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల
FCRI BSc Forestry Admission 2026 : సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్ కోర్సులో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు.
BSc Forestry Admission 2026 : పర్యావరణం, అడవుల పరిరక్షణపై ఆసక్తి ఉండి, అటవీ శాస్త్రంలో నిపుణులుగా స్థిరపడాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ కళాశాల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండగా…. ఐసీఎఫ్ఆర్ఈ (ICFRE), ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందింది.
మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉండే ఈ ప్రతిష్టాత్మక కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 సీట్లను భర్తీ చేయనున్నారు.
- రెగ్యులర్ సీట్లు : 50
- ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా సీట్లు: 05
- పేమెంట్ కోటా సీట్లు: 10
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గుర్తించిన 10+2 విధానంలో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్‌లో బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ గ్రూపులను చదివి ఉండాలి.
ఇంటర్మీడియట్‌లో ఏ సబ్జెక్టులు చదివారనే దానితో సంబంధం లేకుండా…. రెగ్యులర్ లేదా పేమెంట్ కోటా కింద బీఎస్సీ ఫారెస్ట్ సీటు సాధించాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీ ఈఏపీసెట్-2026 (TG EAPCET-2026) ప్రవేశ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే ఈ సీట్లను కేటాయిస్తారు.
- అర్హత కలిగిన విద్యార్థులు జూలై 1, 2026 నుండి జూలై 25, 2026 వరకు కళాశాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (SC/ST/PH) అభ్యర్థులకు రూ. 400, ఇతర జనరల్/బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 600, పేమెంట్ కోటా కింద దరఖాస్తు చేసుకునే వారు రూ. 3,000 చెల్లించాలి.
- అధికారిక వెబ్‌సైట్: https://www.fcrihyd.in/
- మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 08454-211930, 08454-211939, 6303827100 లలో సంప్రదించవచ్చు లేదా fcriadmissions@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

