...
...
Next Story

ఆర్టిస్టుతో బెడ్‌రూమ్‌లో దొరికిపోయిన 'బాసింగా బలాలే సాంగ్' ఫేమ్ ఈశ్వర్ సాయి - భార్య ఫిర్యాదు

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి… తోటి నటితో ఏకాంతంగా ఉంటూ భార్యకు దొరికిపోయారు. వేములవాడలో వెలుగు చూసిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

Published on: Aug 19, 2026, 16:48:38 IST
Advertisement

తెలుగు జానపద రంగలో తన డ్యాన్స్ తో ఓ ఊపు ఊపేస్తున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా ఫోక్ డ్యాన్సర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని…. ఒక గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరినీ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

భార్య ఎంట్రీతో…

బెడ్‌రూమ్‌లో దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి
బెడ్‌రూమ్‌లో దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి తనతో కలిసి అనేక ఫోక్ సాంగ్స్‌లో నటించిన నటి మాధురి రాథోడ్‌తో కలిసి ఏకాంతంగా గడుపుతున్నారు. ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అకస్మాత్తుగా గదిలోకి వెళ్లి వారిద్దరినీ పట్టుకున్నారు. వీడియోలో మాధురి రాథోడ్ బెడ్‌పై కూర్చుని ఉండగా…. ఈశ్వర్ సాయి బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య శరణ్య గదిలోనే వారిద్దరిపై దాడి చేశారు. ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కాంబినేషన్‌లో వచ్చిన చాలా జానపద గేయాలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించి సూపర్ హిట్ అయ్యాయి. 'రాతిరి రాతిరి రాతిరిలో..', 'సీటి సీర..', 'లాయి లాయి లబ్బరు బొమ్మ..', 'ప్రమీల ఓ ప్రమీల' లాంటి పాటలు ఈ జంటకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇటీవల వచ్చిన 'బాసింగ బాసింగ బలాలే' సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసింది. రీల్స్‌లో, పాటల్లో జంటగా మెరిసి ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఇప్పుడు ఇలా ఏకాంతంగా దొరికిపోవడం ఫోక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

పోలీసులను ఆశ్రయించిన భార్య…

ఈ వ్యవహారంపై భార్య శరణ్య మీడియా ముందు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. తమ వివాహం జరిగి ఏడేళ్లు అవుతోందని…. తన భర్తకు తాగే అలవాటు కూడా లేదని చెప్పారు. "గతంలో మాధురి రాథోడ్‌కు బ్రేకప్ అయినప్పుడు నేనే స్వయంగా వెళ్లి ఓదార్చాను. మా కళ్ల ముందే తిరిగే ఆ అమ్మాయి చాలా మంచిది అనుకున్నాను. కానీ నా పక్కనే ఉంటూ నా సంసారాన్ని ఇలా కూలుస్తుందని అసలు ఊహించలేదు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ మెసేజ్‌లు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను," అని కన్నీరుమున్నీరయ్యారు.

భర్త ద్రోహాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మంచివాడేనని, ఇతర మహిళల ప్రవర్తన వల్లే ఇలాంటి దారి పట్టాడని ఆరోపించారు. కుటుంబాలను కూల్చే ఇలాంటి వ్యక్తులను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe