అబుదాబి ఎయిర్‌పోర్ట్ సమీపంలో తెలంగాణ వ్యక్తికి గాయాలు.. సిరిసిల్ల నుంచి తల్లితండ్రుల రిక్వెస్ట్

అబుదాబి ఎయిర్‌పోర్ట్ సమీపంలో తెలంగాణకు చెందిన వ్యక్తి గాయాపడ్డాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి వివరించాడు.

Updated on: Mar 04, 2026 5:53 PM IST
By , Siricilla
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘర్షణల మధ్య అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అతని తల్లిదండ్రులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్.రాజేశ్వరరావు ఈ సంఘటనలో గాయపడ్డారని అతని తండ్రి ప్రభాకర్ రావు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. తాను, అనేక మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

'నా కొడుకు ఒక సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నాడు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. వీడియో కాల్ ద్వారా మాతో మాట్లాడాడు. కానీ మాకు గాయాలను చూపించడం లేదు. నా కొడుకు త్వరగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను' అని ప్రభాకర్ రావు తెలిపారు. రాజేశ్వరరావును భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. తమ కొడుకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల బృందం, గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కారణంగా తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. మదీనాకు ప్రయాణించిన యాత్రికులు సౌకర్యాలు, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాల రద్దు కారణంగా తాను హైదరాబాద్‌కు తిరిగి రావడం ఆలస్యమైందని మొహమ్మద్ అబ్దుల్ రజాక్ పీటీఐతో అన్నారు. అయితే తన వసతి, ఇతర ఏర్పాట్లను ట్రావెల్ ఏజెన్సీ చూసుకుందని వెల్లడించారు.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ నుండి లండన్, అమెరికాకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పెరుగుతున్న ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, రద్దు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా పెంచాయి. పలు ప్రాంతాల గగనతలంలో అంతరాయాల కారణంగా విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించి, సేవలను సర్దుబాటు చేయడంతో ధరలు పెరిగాయి.

హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య విమాన కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైంది. హైదరాబాద్ నగరం, UAE మధ్య రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More