...
...
Next Story

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం...ఫ్యాన్‌కు ఉరివేసుకుంటుండగా..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుంటుండగా.. కుటుంబ సభ్యులు గది తలుపులు పగలగొట్టి కాపాడారు.

Published on: Sep 6, 2026, 17:00:08 IST
Advertisement

తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో తన డ్యాన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు తక్షణమే స్పందించి గది తలుపులు బద్దలుగొట్టి ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మాధురి రాథోడ్
మాధురి రాథోడ్

ఈ విషాద ఘటన వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తోటి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దారుణంగా మోసం చేశాడని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టుగా ఆరోపణలు చేసింది.

ఈ మోసంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మాధురి రాథోడ్ వాపోతోంది. న్యాయం జరగకపోవడం, సమాజంలో ఎదురవుతున్న అవమానాలు, పోలీసుల అలసత్వంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా వేరే దారి లేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు మాధురి బంధువులు చెబుతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జానపద పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మాధురి రాథోడ్ విస్తృతమైన గుర్తింపు పొందింది. న్యాయం కోసం పోరాడాల్సిన సమయంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం బాధాకరమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది మాధురి.

తెలుగు జానపద కళారంగంలో నృత్య కళాకారిణి మాధురి రాథోడ్, తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయిల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మించి దారుణంగా మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ చేసిన ఆరోపణలు చేసింది. అంతకుముందు వీరుద్దరూ కలిసి ఒక గదిలో ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య వెళ్లింది. ఆ సమయంలో తీసిన వీడియో సంచలనమైంది. ఈ ఎపిసోడ్‌లో ఈశ్వర్ సాయి భార్య కెమెరా ముందు మాట్లాడిన మాటలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks