ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటుగా మరికొందరు నేతలు పరిగి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం వెళ్తుండగా హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావుతోపాటుగా మరికొందరు నేతలు పరిగికి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.
అయితే అంతకుముందు రైతుల నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు పరిగి పర్యటనకు బయలుదేరిన హరీష్ రావును మంగళవారం హైదరాబాద్‌లో గృహనిర్బంధంలో ఉంచారు. తెల్లవారుజామున ఆయన నివాసం బయట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన పరిగికి బయలుదేరకుండా అడ్డుకున్నారు.
పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోలే గ్రామాల్లో ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కోసం తమ భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులతో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశం అవ్వాలనుకున్నారు.
పోలీసులు సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన నేతలు పరిగి వెళ్తుండగా.. అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉందని, బలహీనవర్గాల గొంతుకగా పనిచేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
'కాళ్లాపూర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టుకున్నాం. కానీ అక్కడ టెంట్లు పీకేశారు. మహిళలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. భూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి? మమ్మల్ని అడ్డుకున్నా.. తప్పకుండా కళ్లాపూర్ వెళ్తాం. మా పోరాటం ఆగదు. రైతుల గొంతుకగా మారుతాం.' అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
{{/usCountry}}'కాళ్లాపూర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టుకున్నాం. కానీ అక్కడ టెంట్లు పీకేశారు. మహిళలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. భూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి? మమ్మల్ని అడ్డుకున్నా.. తప్పకుండా కళ్లాపూర్ వెళ్తాం. మా పోరాటం ఆగదు. రైతుల గొంతుకగా మారుతాం.' అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
{{/usCountry}}పారిశ్రామిక పార్క్ కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని యోచిస్తున్న కల్లాపూర్, రాపోలే గ్రామాలలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ భూములను వదులుకోవడానికి నిరాకరిస్తూ రిలే నిరసనలు ప్రారంభించారు. బీఆర్ఎస్ ఇప్పటికే రైతులకు తమ మద్దతును ప్రకటించింది.