TG Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ - మైనింగ్ పై మాటల యుద్ధం, వాడీవేడిగా సమావేశాలు

Telangana Assembly Updates : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు హరీశ్ రావ్ భూముల వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తామని…. ఇందుకు సిద్దమా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

Published on: Mar 29, 2026 12:47 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ నినాదాలు చేస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

ఆ తర్వాత సభలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని మార్షల్స్ అడుకున్నారు.

హౌస్ కమిటీ విచారణకు సిద్ధమా - సీఎం రేవంత్

బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో అధికార పక్షం వైపు నుంచి కూడా రియాక్షన్ గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని చెప్పారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

“బాలానగర్ లో వందల కోట్ల భూమి కొల్లగొట్టిన విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హరీష్ రావు సంప్రదించారు. అందులో తన తమ్ముడు, మామ ఇరుక్కున్నారని ఎన్నో సార్లు బ్రతిమిలాడితే దానికి సహకరించలేదని బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు . దీనిపైన పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోమ్ శాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగించాం. 48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా..? కాళేశ్వరం కేసులో కెసీఆర్, హరీష్ ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే దానం, కడియ శ్రీహరి, మందుల సామేల్, రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వారి పాలనలో చోటు చేసుకున్న భూ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని స్పీకర్ ను కోరారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇక్కడ వీక్షించండి….

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More