Harish Rao Arrest : మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. పరిగి వెళ్తుండగా అదుపులోకి!

Harish Rao Arrest : బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటన సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.

Published on: Apr 7, 2026, 12:38:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండస్ట్రియల్‌ పార్క్‌ బాధిత రైతులను కలిసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటుగా మరికొందరు నేతలు పరిగి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం వెళ్తుండగా హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావుతోపాటుగా మరికొందరు నేతలు పరిగికి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.

అయితే అంతకుముందు రైతుల నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు పరిగి పర్యటనకు బయలుదేరిన హరీష్ రావును మంగళవారం హైదరాబాద్‌లో గృహనిర్బంధంలో ఉంచారు. తెల్లవారుజామున ఆయన నివాసం బయట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన పరిగికి బయలుదేరకుండా అడ్డుకున్నారు.

పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోలే గ్రామాల్లో ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కోసం తమ భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులతో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశం అవ్వాలనుకున్నారు.

పోలీసులు సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన నేతలు పరిగి వెళ్తుండగా.. అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉందని, బలహీనవర్గాల గొంతుకగా పనిచేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

'కాళ్లాపూర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టుకున్నాం. కానీ అక్కడ టెంట్లు పీకేశారు. మహిళలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌ తరలిస్తున్నారు. భూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి? మమ్మల్ని అడ్డుకున్నా.. తప్పకుండా కళ్లాపూర్ వెళ్తాం. మా పోరాటం ఆగదు. రైతుల గొంతుకగా మారుతాం.' అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

పారిశ్రామిక పార్క్ కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని యోచిస్తున్న కల్లాపూర్, రాపోలే గ్రామాలలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ భూములను వదులుకోవడానికి నిరాకరిస్తూ రిలే నిరసనలు ప్రారంభించారు. బీఆర్ఎస్ ఇప్పటికే రైతులకు తమ మద్దతును ప్రకటించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More