...
...
Next Story

పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పులు - ఒకరికి తీవ్ర గాయాలు..! బీజేపీ నేతల ఆందోళన

మేడ్చల్ జిల్లాలోని పోచారం పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో సోనుసింగ్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోరక్షుడైనా సోనుసింగ్ పై కాల్పులు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Published on: Oct 23, 2025, 11:42:09 IST
Advertisement

హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో ఓ గోరక్షకుడికి పేరొందిన సోనుసింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పులు(representative image )
పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పులు(representative image )

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఘట్కేసర్ సమీపంలో ఆవుల అక్రమ రవాణాను అడ్డుకున్న సోనుసింగ్(ప్రశాంత్) పై కాల్పులు జరిగాయని తెలంగాణ బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఇబ్రహీం అనే వ్యక్తి గోవులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. ఈ విషయంలో ఇబ్రహీం, సోనూ మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. గత నెలలో గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను సోనూ వెంబడించాడు. ఈ విషయంలోనే ఇబ్రహీం… సోనూపై కోపంతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తాజాగా వాగ్వాదం చోటు చేసుంది. దీంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో సోనూపై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనూను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనునూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తదితరులు పరామర్శించారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe