2026 సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ ఆమోదం
జీహెచ్ఎంసీ 2025-26 సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రధానంగా రోడ్డు మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం మెరుగుదలపై దృష్టి సారించింది. మునుపటి జీహెచ్ఎంసీ కోసం 2025-26 సంవత్సరానికి రూ.11,010 కోట్ల సవరించిన అంచనాలను కూడా కమిటీ ఆమోదించింది.

11,460 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఎక్కువ భాగం రోడ్లు, వంతెనలు, ప్రధాన రహదారులను సరిగా మెయింటేనే చేసే సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం(సీఆర్ఎంపీ), హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌సీఐటీఐ) ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి.
రెండో అత్యధిక వ్యయం పరిశుభ్రత, రీసైక్లింగ్ కార్యక్రమాలపై ఉంటుంది. వీటిలో చెత్త నుండి ఎనర్జీ ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ. 746 కోట్లు కేటాయించారు. ఇతర ప్రధాన వ్యయం గ్రీన్ బడ్జెట్. దీని కోసం ప్రత్యేకంగా రూ. 90 కోట్లు కేటాయించారు.
ఆస్తి పన్ను ద్వారా రూ.2,245 కోట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రూ.1,200 కోట్లు, రాష్ట్ర ఆర్థిక కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) గ్రాంట్ల ద్వారా రూ.400 కోట్లు ఆదాయం వస్తుందని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ.3,100 కోట్లు, రుణాలు తీసుకోవడం ద్వారా రూ.800 కోట్లు సమకూరుతాయని భావిస్తోంది.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ 22 ప్రతిపాదనలను కూడా ఆమోదించింది. వీటిలో బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఎన్బీటీ నగర్ కన్వెన్షన్ హాల్‌గా మార్చడం, కేబీఆర్ పార్క్ వాక్ చుట్టూ ఉన్న హైదరాబాద్ స్కల్ప్చర్ పార్క్ ఉన్నాయి.
మియాపూర్, అమీన్‌పూర్‌లలో H-CITI ప్రాజెక్టుకు భూసేకరణ అనుమతులు, చందానగర్‌లో స్మశానవాటిక అభివృద్ధి, కోటి ఎస్బీఐ ప్రధాన శాఖ సమీపంలోని జంబాగ్‌లో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం వంటి ఇతర ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం లభించాయి. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో మూడేళ్ల పాటు ఏఐ చాట్‌బాట్, ఆటోమేటెడ్ ఫారమ్-ఫిల్లింగ్ సేవలతో సహా ఏఐ-ఆధారిత పరిష్కారాల కోసం టెండర్లను ఆహ్వానించాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


