TG Gurukul Diet Charges : గురుకులాలు, హాస్టళ్లకు గుడ్‌న్యూస్ - ఇకపై ప్రతి నెలా డైట్ ఛార్జీలు, అమల్లోకి కొత్త విధానం
Telangana Gurukul Diet Charges : తెలంగాణలోని ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్ల ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 221.24 కోట్లు మంజూరు చేసింది.
Telangana Gurukul Diet Charges : రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, నివాస వసతి గృహ పాఠశాలల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని నివాస విద్యాసంస్థలకు సంబంధించిన ఆహార వ్యయాలు (డైట్ చార్జీలు), కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా సకాలంలో విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై నెలవారీ చెల్లింపులు
గత ప్రభుత్వాల కాలంలో ఈ నిధుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం జరిగేది. దాదాపు 8 నుంచి 9 నెలల వరకు నిధులు రాకపోవడం వల్ల నివాస పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణ భారంగా మారడమే కాకుండా విద్యార్థుల భోజన వసతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థుల కష్టాలను ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని…. మొదట త్రైమాసిక (మూడు నెలలకోసారి) చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ నేరుగా ప్రతి నెలా నిధులు ఇచ్చేలా 'నెలవారీ చెల్లింపుల విధానాన్ని' అమల్లోకి తెచ్చారు.
2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కీలక మార్పును అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చెప్పినట్లుగానే ఇప్పుడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త నిర్ణయం వల్ల విద్యార్థులకు నిరంతరాయంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పోషకాహారం అందుతుంది. హాస్టళ్ల సక్రమ నిర్వహణతో పాటు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న పాఠశాలల అద్దెల చెల్లింపులు కూడా సాఫీగా సాగనున్నాయి. ఇది విద్యార్థుల విద్యా ఫలితాలను పెంచడానికి, పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది.
నిధులు విడుదల…
నెలవారీ చెల్లింపుల నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం…. రూ. 221.24 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. ఈ భారీ నిధుల విడుదల ద్వారా వసతి గృహ పాఠశాలల్లోని విద్యార్థుల పోషణ, సంక్షేమం, వసతి సదుపాయాలకు పూర్తి స్థాయిలో నిరంతర మద్దతు లభించనుంది.
“అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన నివాస సదుపాయాలు కల్పించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సాధికారత సాధించడమే కాకుండా, వారిని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గురుకులాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

