హైదరాబాద్‌ని ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా మారుస్తాం - డిప్యూటీ సీఎం భట్టి
సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గద్దర్ అవార్డులకు సంబంధించిన ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ ను ఫిల్మ్ హాబ్ గా మార్చే దిశగా ముందుకు సాగుతామని చెప్పారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… హైదరాబాద్ నగరాన్ని అతిపెద్ద ఫిల్మ్ ఇండస్రీ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోందని వివరించారు.
డిప్యూటీ సీఎం భట్టి (ఫైల్ ఫొటో)
ఫిల్మ్ హబ్ గా మారుస్తాం - డిప్యూటీ సీఎం భట్టి
“ఇండస్ట్రీ ద్వారా సామాజిక సందేశాలివొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం స్థాయిలో అవార్డులు పొందింది. హైదరాబాద్ నగరాన్ని ఫిల్మ్ హబ్ గా చేసుకునే దిశగా ముందుకెళ్దాం. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి అన్ని విధాలా సహాయ సాకారాలు అందిస్తాం”అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
చిత్ర పరిశ్రమకు ఏ చిన్న సమస్య ఉన్నా అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి హామీనిచ్చారు. హైదరాబాద్ నగరంలో మంచి ఏకో సిస్టమ్ ఉందన్న ఆయన… టాలెండ్ యువత ఎక్కువగా ఉందని చెప్పారు. వీటన్నింటి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మ్ గా ఉన్న దిల్ రాజు ఇండస్ట్రీ సమసస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు.
ఎలాంటి బేధాలు లేకుడా గద్దర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న మణిశర్మ… ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తారనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగాది పండుగ రోజైన మార్చి 19న అత్యంత వైభవంగా ‘గద్దర్ ఫిలిం అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించారు.