ఇవేం ఎండలు బాబోయ్.. బయటకు వెళ్తే జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లే జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో నాలుగైదు రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

Published on: May 20, 2026, 15:35:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని 12 జిల్లాలకు తీవ్రమైన వేడిగాలుల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ ఉన్నాయి.

దంచికొడుతున్న ఎండలు
దంచికొడుతున్న ఎండలు

మంగళవారం వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రం తీవ్రమైన వడగాలుల బారిన పడింది. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకి చేరువయ్యాయి. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత సిద్దిపేటలోని రాఘవపూర్, నల్గొండలోని కట్టంగూర్‌లలో 45.8 డిగ్రీలు నమోదైంది. పెద్దపల్లిలోని పాల్తేం, మంచిర్యాలలోని వెల్గనూర్‌లో 45.7 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్‌లోని కమ్మరపల్లి, సిరిసిల్లలోని పెద్దూరు, కరీంనగర్‌లోని గంగాధర, కామారెడ్డిలోని బొమన్‌దేవిపల్లిలో 45.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా సైదాబాద్‌లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వడగాలుల హెచ్చరికతోపాటు, రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ విశ్లేషణ ప్రకారం, నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమొరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవులు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయి.

సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

తీవ్రమైన వ‌డ గాలులు, ఎండ తీవ్రత‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్రజ‌లంతా అప్రమ‌త్తంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్యలో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్రత్యేక శ్రద్ధ వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు.

ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొద‌లు జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్యారోగ్య సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని, వ‌డ‌దెబ్బతో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే త‌గిన వైద్య స‌హాయం అందించాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ట్టణ ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. సాధ్యమైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్నం ప్రయాణాలు చేయ‌కుండా ఉండాల‌ని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటూ క‌లెక్టర్లకు దిశానిర్దేశం చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి రామ‌కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More