...
...
Next Story

హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం, ట్రాఫిక్ ఇబ్బందులు!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చాలా మంది ఆఫీసుల నుంచి తిరిగివచ్చే సమయం కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Published on: Nov 2, 2025, 21:24:44 IST
Advertisement

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చాలా మంది ఆఫీసుల నుంచి తిరిగివచ్చే సమయం కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో వర్షం

జోడిమెట్ల, నారపల్లి, ఉప్పల్‌, పంజాగుట్ట, జూబ్లిహిల్స్, ఫిలింనగర్, యూసఫ్ గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ముషిరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, కుత్బూల్లాపుర్, బహదూర్‌పల్లి, జీడిమెట్ల, లింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. రాబోయే మూడు రోజుల కూడా తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. సోమవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈరోజు ఉదయం నిజామాబాద్‌తోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వాన పడింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe