IMD Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్ - మరోసారి భారీ వర్షాలు..! వాతావరణశాఖ అంచనాలివే

తెలంగాణకు వాతావరణశాఖ మరో అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 19 నుంచి భారీ వర్షాలు పడొచ్చు. 

Published on: Sep 16, 2026, 06:02:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అధికారిక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్ అప్డేట్స్
తెలంగాణ వెదర్ అప్డేట్స్

సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులకు ఎటువంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయలేదు.

ఇక ఈ నెల 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే…. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.

ఈ తేదీ నుంచి భారీ వర్షాలు…

ఇక సెప్టెంబర్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు చూస్తే… రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుంది.

వర్షాల తీవ్రత కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం, ట్రాఫిక్ నిలిచిపోవడం, చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మున్సిపల్, విద్యుత్ మరియు పోలీస్ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More