మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

తుపాను తీరానికి చేరుకోవడంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో 150-220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక 28వ తేదీన అంటే తుపాను తీరం దాటే రోజున మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ జిల్లాలలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ సహా ఇతర జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28న హైదరాబాద్‌లో గరిష్ట ప్రభావం ఉంటుందని, ఉరుములు, మెరుపులు, గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, అక్టోబర్ 28, 29 తేదీల్లో వర్షపాతం తీవ్రత గణనీయంగా పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 29, 30 తేదీల్లో మంచిర్యాల, నల్గొండ, వరంగల్, హనుమకొండ మరియు ఖమ్మంలలో అతి భారీ వర్షపాతం (115–204 మి.మీ) నమోదయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, అక్టోబర్ 28, 29 తేదీల్లో వర్షపాతం తీవ్రత గణనీయంగా పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 29, 30 తేదీల్లో మంచిర్యాల, నల్గొండ, వరంగల్, హనుమకొండ మరియు ఖమ్మంలలో అతి భారీ వర్షపాతం (115–204 మి.మీ) నమోదయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}ముంథా తుపాను తీరానికి దగ్గరగా వస్తున్నందున భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, వాతావరణ అప్డేట్స్ ఫాలో కావాలని ఐఎండీ సూచించింది.