...
...
Next Story

అక్టోబర్ 18 వరకు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో వాతావరణం ఇలా!

మరికొన్ని రోజులు తెలంగాణ, ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Published on: Oct 14, 2025, 17:41:12 IST
Advertisement

తెలంగాణలోనూ మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి, వరంగల్, మహాబూబ్‌నగర్‌తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ, ఏపీ వర్షాలు
తెలంగాణ, ఏపీ వర్షాలు

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అక్టోబర్ 20 వరకు అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులు రానున్నాయి. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీలలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

అక్టోబర్ 17 నుంచి 18 వరకు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి తదితర ఉత్తరాది జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వారం అంతా అక్టోబర్ 14 నుంచి 18 మధ్య హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా.

ఏపీలో వర్షాలు

అక్టోబర్ 14 నుండి 18 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు లేదా పెద్ద హోర్డింగ్‌ల దగ్గర నిలబడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks