Mulugu Bogatha Waterfalls : బొగత జలపాతానికి భారీగా వరద - పర్యాటకుల సందర్శనలు నిలిపివేత

Mulugu Bogatha Waterfalls : ములుగు జిల్లాలో వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.

Published on: Jul 29, 2026, 15:25:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mulugu Bogatha Waterfalls : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం నిండుకుండను తలపిస్తూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

బొగత జలపాతం (ఫైల్ ఫొటో)
బొగత జలపాతం (ఫైల్ ఫొటో)

సాధారణ రోజుల్లో ఆహ్లాదకరంగా కనిపించే బొగత… ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద ప్రవాహం తరలి వస్తోంది. జలపాతం ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే…. పర్యాటకుల రక్షణ కోసం సమీపంలో ఏర్పాటు చేసిన రక్షణ వలయం (సేఫ్టీ కారిడార్) కూడా పూర్తిగా నీట మునిగిపోయింది.

పర్యాటకులకు నో ఎంట్రీ…

జలపాతం వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రాకూడదని…. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే… బొగత జలపాతం చూసేందుకు చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ములుగు జిల్లాల్లోని పచ్చని అడవి అందాలను వీక్షిస్తూ…. ఈ ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, భద్రాచలం, ములుగు నుంచే కాకుండా వేర్వురు ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుంటారు. ప్రతి ఏటా ఈ జలపాతం అందాలను వీక్షిస్తుంటారు.

అయితే ఈ జలపాతంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వెంటనే సందర్శనలపై ఆంక్షలు విధిస్తారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో… తాత్కాలికంగా సందర్శనలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే పర్యాటకులను అనుమతిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More