హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ.. సిటీ లోపలి పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలికి!

హైదరాబాద్ సిటీ లోపల ఉన్న పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలికి వెళ్లనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది.

Published on: Nov 24, 2025, 15:20:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా అధికారికంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్‌డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తారు.

హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ
హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ

ఈ హిల్ట్ పాలసీలో భాగంగా 22 ఇండస్ట్రీయల్ ఏరియాల్లోని 9,292 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా అవకాశం ఉంటుంది. ఈ భూముల్లో 4,740 ఎకరాలు ప్లాటెడ్ అంటే నిర్మాణాలు చేపట్టినవి. వన్-టైమ్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డీఐఎఫ్) చెల్లింపుల గురించి కూడా నోటీసులో తెలిపారు.

80 ఫీట్ల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువపై 30 శాతం ఇంపాక్ట్ ఫీజు నిర్ణయించారు. అయితే 80 అడుగులు, అంతకంటే ఎక్కువ రోడ్లను ఎదుర్కొంటున్నవి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువలో 50 శాతం చెల్లించాలి. దరఖాస్తుదారులు TG-IPASSలో ఆన్‌లైన్ సమర్పణ సమయంలో 20 శాతం ముందస్తుగా చెల్లించాలి. మిగిలిన 80 శాతం రెండు వాయిదాలలో 45 రోజుల్లోపు క్లియర్ చేయాలి. ఒక నెల గ్రేస్ పీరియడ్ తర్వాత 1 శాతం నెలవారీ జరిమానా వర్తిస్తుంది. ఆ తర్వాత రుసుము జప్తు చేస్తారు, దరఖాస్తుదారు అనర్హుడు అవుతాడు.

TGIIIC/IALA 7 రోజుల్లోపు ప్రాథమిక పరిశీలనను పూర్తి చేస్తాయి. మరో 7 రోజుల్లో తుది ఆమోదం లభిస్తుంది. ఆరు నెలల గడువు నిబంధనను నిర్దేశించారు. అన్ని దరఖాస్తులను ఆ గడువులోపు దాఖలు చేయాలని నిబంధన విధించారు. కొత్త విధానం ప్రకారం దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, లేఅవుట్ సవరణలను పర్యవేక్షించడానికి TGIIIC నోడల్ ఏజెన్సీగా నియమించారు.

గతంలో పరిశ్రమల కోసం భూమలు కేటాయించారు. అయితే కొన్ని దశాబ్దాల్లో సిటీ ఎంతగానో అభివృద్ధి అయింది. ఒకప్పుడు సిటీ అవతల అనుకున్న ప్రాంతాలు ఇప్పుడు సిటీకి ముఖ్యమైన ఏరియాలుగా అయ్యాయి. అప్పుడు ఏర్పాటు అయిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్య కారకాలుగా మారాయి. గతంలోనే ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని తెలిపింది. ఆ భూములను వేరే రకంగా ఉపయోగిస్తామని వెల్లడించింది. అందులో భాగంగా తాజాగా చర్యలు తీసుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More