HMWSSB : వేసవి వేళ ప్రతి ఫ్యామిలీ 20 శాతం నీటిని ఆదా చేసుకోవాల్సిందే..! నగరవాసులకు జలమండలి కీలక సూచనలు

Hyderabad Water Board Summer Plan : పెరుగుతున్న ఎండలు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. నీటిని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచింది.

Published on: Apr 12, 2026 9:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నగరంలో తాగునీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

నగరవాసులకు జలమండలి కీలక విజ్ఞప్తి
నగరవాసులకు జలమండలి కీలక విజ్ఞప్తి

నగరంలోని పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన…. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు.

గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటి సరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ ని డెలివరీ చేసేలాగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.

పౌరులకు ముఖ్య సూచనలు:

  • విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు… ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు.
  • బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి.
  • స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు.
  • లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.
  • అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి.

జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ… వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More