ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై జలమండలి సీరియస్.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి
Hyderabad : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(HMWSSB) తన లోగోను దుర్వినియోగం చేయవద్దని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను హెచ్చరించింది. కొందరు లోగోను ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించింది.
హైదరాబాద్ జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జలమండలి దృష్టికి వచ్చింది. ఈ విధమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమైనవిగా జలమండలి పేర్కొంది. జలమండలి లోగో అనేది సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నం అని తెలిపింది. దీనిని అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవల భాగంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మోసపూరిత చర్యగా గుర్తిస్తారని జలమండలి పేర్కొంది.
ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించారు. లోగో దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జలమండలి పేరు, లోగో, బ్రాండ్‌ను ఉపయోగిస్తూ కొంతమంది ప్రైవేట్ బోర్‌వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది. దీనివల్ల ఆ నీరు జలమండలి ద్వారా సరఫరా అవుతుందనే.. తప్పుడు భావన కలుగుతోంది.
ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సాధారణంగా బోర్‌వెల్‌ల నుండి సేకరిస్తారు. ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి కావు. అలాగే నాణ్యత పరీక్షలు కూడా చేయరు. అందువల్ల ఈ నీటిని వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందని జలమండలి తెలిపింది.
సాధారణ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని జలమండలి సూచిస్తోంది. ఈ నీటి నాణ్యత సురక్షితం కాకపోవచ్చు, ఆరోగ్యానికి హానికరమై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకునే సందర్భంలో జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేయాలని హైదరాబాద్ వాటర్ బోర్డు కోరుతుంది. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని పొందవచ్చు.
జలమండలి లోగో వాడకంలాంటి ఘటనలు గుర్తించిన వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో ఒక ప్రైవేట్ నీటి ట్యాంకర్ జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జలమండలి పరిధిలోని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోగో దుర్వినియోగం జరగకుండా కఠినంగా పర్యవేక్షణ చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు గమనించినట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే సమీప జలమండలి కార్యాలయానికి లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్వినియోగాన్ని పూర్తిగా నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని జలమండలి స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


