Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - 36 గంటలపాటు నీటి సరఫరాకు బ్రేక్, ఏరియాల వారీగా వివరాలివే

హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. మంజీరా ఫేజ్-3లో పలు మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 7,8 తేదీల్లో పలు కాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Published on: Mar 06, 2026 10:47 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ లోని పంప్ హౌస్ లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

HMWSSB అలర్ట్
HMWSSB అలర్ట్

ఇక పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను మార్పు చేస్తారు. సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్పు చేయటంతో పాటు పలు మరమ్మతు పనులు చేపడుతున్నారు.

మార్చి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు(36 గంటలు) ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు:

  • ఓ అండ్ ఏం డివిజన్ నెం.3: షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుంది.
  • ఓ అండ్ ఏం డివిజన్ నెం.18: మణికొండ, కోకాపేట్, నర్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు.
  • ట్రాన్స్‌మిషన్ I & II: నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More