ఫిబ్రవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
ఫిబ్రవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ లిస్టులో ఏ ప్రాంతాలు ఉన్నాయో తెలుసుకోండి.
మంజీర ఫేజ్-2 నీటి లైన్లలో పెద్ద లీకేజీల కారణంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగించాయి. ఫిబ్రవరి 11 నుండి 12 వరకు మరమ్మతు పనులు చేపడతామని, ఈ సమయంలో కొన్ని ప్రాంతాలకు తక్కువ నీటిని విడుదల చేస్తామని లేదా మరికొన్ని ప్రాంతాలకు సరఫరాను పూర్తిగా ఆపేస్తామని HMWSSB(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్) తెలిపింది.

మంజీర ఫేజ్-2 నీటి లైన్లకు పెద్ద లీకేజీతో ఈ సమస్య వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. దీనితో కొన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా పటాన్‌చెరు నుండి హైదర్‌నగర్ వరకు, కలబ్‌గూర్ నుండి పటాన్‌చెరు వరకు నీటి సరఫరా నిలిచిపోతుంది. రాంచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్ ప్రాంతాలు ప్రభావితం అవుతాయి.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీర ఫేజ్-2లోని వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా పటాన్‌చెరు నుండి హైదర్ నగర్ వరకు, కలబ్‌గూర్ నుండి పటాన్‌చెరు వరకు పెద్ద లీకేజీలు సంభవించాయని HMWSSB అధికారులు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ లీకేజీలను సరిచేయడానికి ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 12న రాత్రి 10 గంటల వరకు నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
ఈ 40 గంటల్లో కొన్ని ప్రాంతాలకు తక్కువ నీటి సరఫరా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాలకు సరఫరాలో పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని సరిగా ఉపయోగించుకోవాలని అధికారులు ప్రకటనలో కోరారు. నీటిని తక్కువ మెుత్తంలో వినియోగించాలని, సేవల్లో అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


