హైదరాబాద్ టు అరుణాచలం...! బడ్జెట్ ధరలో 5 రోజుల IRCTC టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి
ఈ ఫిబ్రవరి నెలలో అరుణాచలం వెళ్తారా..? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యమైన వివరాలను పూర్తి కథనంలో చూడండి…
ఈనెలలో అరుణాచలం వెళ్లే ప్లాన్ ఉందా…? అయితే మీకోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ…5 రోజులు ఉంటుంది. కాచీపురం, అరుణాచలంతో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొచ్చు.

ఈనెలలోనే జర్నీ….
హైదరాబాద్ నుంచి అరుణాచలం ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఫిబ్రవరి 20, 2026వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మారితే… మరో తేదీలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.
టూర్ ప్యాకేజీలోని వివరాల ప్రకారం…. టికెట్లు బుకింగ్ చేసుకున్నవాళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. సాయంత్రం 5 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ 17653) ఉంటుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు. ఇక రెండో రోజు అంటే పుదిచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ తర్వాత అరోవిల్లే, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను చూస్తారు. రాత్రి పుదిచ్చేరిలోనే బస ఉంటుంది.
మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత… నేరుగా అరుణాచలం బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రి తిరువన్నమలైలోనే ఉంటారు. ఇక నాల్గో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత… కాంచీపురానికి బయలుదేరుతారు. అరుణాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర ఆలయం తీసుకెళ్తారు. ఆ తర్వాత అరక్కోణం స్టేషన్ వెళ్తారు. తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరి రోజు ఉదయం 07.50 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ధరలు ఎంతంటే…?
కంఫర్ట్ 3ఏసీలో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14740గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.10,700, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.8060గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 17060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12670గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు, ఇతర వివరాల కోసం 8287932229 / 8287932228 / 9701360701 మొబైల్ నెంబర్లకు కాల్ చేయవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు కూడా వర్తిస్తాయి.

E-Paper












