...
...
Next Story

Ration Card Corrections : మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా..? ఇలా సరిచేసుకోవచ్చు

Telangana Smart Ration Card Corrections : తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఇందులో తప్పులుంటే సరిచేసుకునే వీలుంటుంది.

Published on: Oct 3, 2026, 12:13:50 IST
Advertisement

Telangana Smart Ration Card Corrections : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఈ కార్డుల పంపిణీ పూర్తయింది.అ యితే, పలువురు లబ్ధిదారుల స్మార్ట్ రేషన్ కార్డుల్లో పేర్లు, చిరునామాలు, ఊరి పేర్లు తప్పుగా ప్రింట్ కావటంతో ఆందోళన చెందుతున్నారు.

ఎలా ఎడిట్ చేసుకోవచ్చంటే..?

స్మార్ట్ రేషన్ కార్డు
స్మార్ట్ రేషన్ కార్డు

కుటుంబ పెద్ద పేరు సరిగ్గా ఉండి….. మిగతా సభ్యుల పేర్లు తప్పుగా పడటంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇబ్బందిపడాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఫిజికల్ కాపీలు వచ్చినప్పటికీ… ఆన్ లైన్ లో కనిపించే డేటా అప్డేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నిజానికి కొన్ని సాంకేతిక లోపాల వల్ల కార్డుల్లో పేర్లు, చిరునామాలలో చిన్నచిన్న తప్పులు దొర్లాయి. ఈ అంశాన్ని గుర్తించిన అధికారులు ఆధార్ డేటాబేస్, పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్ రికార్డుల ఆధారంగా వెనుకటి తప్పులను ఇప్పటికే డిజిటల్‌గా సరి చేశారు. మీ ఫిజికల్ కార్డుపై పాత తప్పులు ఉన్నప్పటికీ…. ఆన్‌లైన్ డేటాబేస్‌లో మాత్రం మీ సరైన వివరాలు అప్డేట్ అయి ఉంటాయి.

ఒకవేళ టీ - రేషన్ యాప్ లోనూ వివరాలు ఎడిట్ కాకుండా ఉంటే… వెంటనే తహసీల్దార్ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీ ఫిర్యాదును స్వీకరించి… తగిన మార్పులు చేసేందుకు వీలుంటుంది. ఆ తర్వాత మళ్లీ టీ - రేషన్ యాప్ లో కి వెళ్లి చెక్ చేసుకుంటే… ఎలాంటి తప్పులు లేకుండా ఉన్న కార్డును పొందొచ్చు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు డౌన్లోడ్ ఇలా….

  • ముందుగా మీ మొబైల్‌లోని గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారిక 'T-Ration' యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి.
  • మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • యాప్ హోమ్‌‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న 'Scan Smart RC' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ వద్ద ఉన్న ఫిజికల్ స్మార్ట్ కార్డుపై ముద్రించి ఉన్న బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను మీ ఫోన్ కెమెరాతో స్కాన్ చేయండి.
  • స్కాన్ చేయగానే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన మీ సమగ్ర కుటుంబ వివరాలు (Digital verification of smart card) స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
  • మీ పేర్లు, చిరునామా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి.
  • వివరాలన్నీ సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత……. పైన కనిపిస్తున్న 'డౌన్‌లోడ్' ఐకాన్‌పై క్లిక్ చేసి మీ స్మార్ట్ రేషన్ కార్డును పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ చేసుకున్న ఈ డిజిటల్ కార్డు ప్రింట్‌ను జిరాక్స్ లేదా కలర్ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
  • రేషన్ దుకాణాల వద్ద లేదా ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ ప్రింటెడ్ కాపీని నేరుగా ఉపయోగించుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks