TG Pension Application Form : కొత్త పింఛన్ దరఖాస్తుల అప్డేట్ - అప్లికేషన్ ఫారమ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana Cheyutha Pension Application : చేయూత పింఛన్ల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…. 

Published on: Aug 11, 2026, 09:44:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Cheyutha Pension Application Form : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన 'చేయూత' పింఛన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు సకాలంలో పింఛన్లు అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.

చేయూత దరఖాస్తు ఫారమ్
చేయూత దరఖాస్తు ఫారమ్

అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. చేయూత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌లను అందుబాటులో ఉంచారు. ప్రజలు నేరుగా ఇంటర్నెట్ ద్వారా వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

చేయూత అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ ఇలా….

  • ముందుగా చేయూత అధికారిక వెబ్‌సైట్ https://www.cheyutha.telangana.gov.in/ ని సందర్శించాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న 'చేయూత అప్లికేషన్ ఫారమ్స్' (Cheyutha Application Forms) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వేర్వేరుగా దరఖాస్తు ఫారమ్‌లు కనిపిస్తాయి. మీకు కావాలసిన లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్‌పై అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత, పైన ఉండే 'డౌన్‌లోడ్' ఆప్షన్ ద్వారా ఫారమ్‌ను సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి..?

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సంబంధిత బిల్ కలెక్టర్లకు ఈ పూరించిన దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల పరిశీలన ఇలా....

అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఐటీ శాఖకు చెందిన '360 డిగ్రీ సమగ్ర వేదిక' డేటాబేస్ ద్వారా ప్రాథమికంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి విచారణ కోసం దరఖాస్తులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ/ఎంఎంసీ/సీఎంసీ డిప్యూటీ కమిషనర్ లేదా తహసీల్దార్లకు పంపుతారు.

వెరిఫికేషన్ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారుని వద్దకు వచ్చి… చేయూత సామాజిక భద్రతా పింఛన్ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, డీఆర్‌డీఓ (DRDO) మరియు హైదరాబాద్‌లోని డీఆర్‌ఓ (DRO) ఆఫీసుకు పంపిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ తుది ఆమోదం తెలిపిన వెంటనే పింఛన్లను మంజూరు చేసి, ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

మీ వద్ద ఉండాల్సిన పత్రాలు :

  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
  • ఆధార్ కార్డు (తప్పనిసరి)
  • వయో నిర్ధారణ పత్రం - జనన ధృవీకరణ / పాఠశాల ధృవీకరణ / ఓటర్ కార్డు (తప్పనిసరి)
  • రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం (తప్పనిసరి)
  • బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ - దివ్యాంగ మైనర్ పిల్లల విషయంలో జాయింట్ ఖాతా (తప్పనిసరి)
  • భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు (వితంతు పింఛన్ దరఖాస్తుదారులకు)
  • విడాకులు/విడిపోయిన పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక (ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తుదారులకు)
  • చేనేత - జౌళి శాఖ ధృవీకరణ పత్రం (చేనేత కార్మికుల విషయంలో)
  • ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం (కల్లు గీత కార్మికుల విషయంలో)
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More