...
...
Next Story

టీజీ టెట్ 2026 అభ్యర్థులకు అప్డేట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. కొత్త నోటిఫికేషన్ (జనవరి సెషన్) కు సంబంధించిన సిలబస్ అందుబాటులోకి వచ్చింది. టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు... అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: Nov 21, 2025, 09:15:37 IST
Advertisement

తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి సెషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.అర్హులైన అభ్యర్థులు ఈనెల 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరోవైపు అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

టీజీ టెట్ 2026 సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఇక్కడ హోం పేజీలో కనిపించే సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి.
  3. 15 పేపర్ల పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై నొక్కితే సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది.
  4. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

జనవరి 3 నుంచి పరీక్షలు:

తెలంగాణ టెట్
తెలంగాణ టెట్

టీజీ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా… మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. ఇక తెలంగాణ టెట్ - 2026 ఫలితాలను ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.

టెట్ పరీక్షా విధానం:

ఇక తెలంగాణ ‘టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు.పేపర్‌-2లో మళ్లీ గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది.

పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి మీ సబ్జెక్ట్ సిలబస్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks