మీ సేవ వాట్సాప్‌లో డీఈఈసెట్ హాల్ టికెట్లు ఎలా పొందాలి? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

మీ సేవ వాట్సాప్‌లో డీఈఈసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పొందేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి.

Published on: May 15, 2026, 10:30:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం, డీఈఈసెట్ (Diploma in Elementary Education Common Entrance Test) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 15 మే 2026 ఉదయం 10:00 గంటల నుంచి వాట్సాప్ ద్వారా తమ హాల్ టికెట్లను వెంటనే పొందవచ్చు. డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 21, 22 తేదీల్లో జరగనుంది.

వాట్సాప్ మీసేవ
వాట్సాప్ మీసేవ

డీఈఈసెట్ హాల్ టికెట్ పొందే విధానం

  • అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోవాలి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపాలి.
  • “DEECET Hall Ticket” అని టైప్ చేయాలి.
  • మెనూలో కనిపించే “Open Service” ఎంపికపై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలు నమోదు చేయాలి: Payment ID, Application Number, Mobile Number Date of Birth (DOB).

వివరాలు సమర్పించిన వెంటనే డీఈఈసెట్ హాల్ టికెట్ వాట్సాప్‌లో అందుతుంది. ఈ సేవ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సౌకర్యవంతమైన, పారదర్శకంగా, సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మీ సేవ ద్వారా పౌర సేవలను మరింతగా విస్తరిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిజిటల్ సేవల వేదిక అయిన మీ సేవ, 18 నవంబర్ 2025న ప్రారంభించిన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవల ద్వారా ప్రజలకు మరింత సులభంగా ప్రభుత్వ సేవలను అందిస్తోంది. 18 నవంబర్ 2025న ప్రారంభమైన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ వేదిక తెలంగాణలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందిన డిజిటల్ పౌర సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది.

ఈ సేవల ద్వారా పలు సర్టిఫికేట్లను ప్రజలు పొందుతున్నారు. జనన ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, పోలీస్ చలాన్ సేవలు, విద్యుత్ బిల్లు సేవలు, బీఐఈ ఫలితాల సేవలు వంటివి పొందవచ్చు. వాట్సాప్ ఆధారిత ప్రభుత్వ సేవలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం, మీ సేవ వేదికల ద్వారా మరిన్ని డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More