మేడారం మహాజాతర : గద్దెలపైకి సారలమ్మ.. నేడు సమ్మక్క రాక.. వనమంతా జనమే..

మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది. సారక్క వచ్చిన వేళ మేడారం జనసంద్రంగా మారిపోయింది. భక్తులకు అసౌకర్యం లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది.

Updated on: Jan 29, 2026, 10:46:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు కీలకమైన సారక్క వచ్చే వేళ… మేడారమంతా కూడా భక్తజనసంద్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

మేడారం జాతర
మేడారం జాతర

బుధవారం సాయంత్రం గిరిజన పూజారులు…. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను మేడారానికి తీసుకువచ్చారు. బుధవారం అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మహాజాతరలో తొలి ఘట్టం ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు వన దేవతలను తెచ్చారు. వన దేవతలు వచ్చే సమయంలో శివసత్తులు అడుగడుగునా పూనకాలతో ఊగిపోయారు. మూడు అంచెల భద్రత నడుమ వన దేవతలను గద్దెల మీదకు తీసుకొచ్చారు. గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

నేడు సాయంత్రం(జనవరి 29) సమ్మక్కను చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.

మరోవైపు సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలో దర్శనం జరుగుతోందని చెబుతున్నారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా, క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగుతోందని భక్తులు పేర్కొంటున్నారు.

మరోవైపు ఈ మేడారం జాతర కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 4,000 బస్సులను నడుపుతోంది. మెుత్తం 51 వేల ట్రిప్పులను ప్లాన్ చేసింది. ఈ మహా జాతర కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌలభ్యం కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం యాప్‌లో భద్రతా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో SOS హెచ్చరికను పంపడం, ఫిర్యాదులను నమోదు చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు తప్పిపోకుండా రిస్ట్‌బ్యాండ్‌లను ఈసారి ప్రవేశపెట్టారు. దీని ద్వారా పిల్లలు తప్పిపోతే ఈజీగా తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంటారు.

ఈ పండుగలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి, పర్యావరణ అనుకూల చర్యలను అనుసరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంపన్నవాగు వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు చేసింది. జంపన్నవాగులో సరిపడా నీరు ప్రవహిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More