...
...
Next Story

భూపాలపల్లి జిల్లాలో ఘోరం - భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త..! ఆపై ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో రామాచారి(50) అనే వ్యక్తి తన భార్య సంధ్యను ఉరి వేసి చంపాడు. తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపి ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

Published on: Dec 13, 2025, 12:36:53 IST
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను ఉరివేసి చంపేసిన భర్త…ఆపై అతను కూడా అత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు భార్యను చంపేసిన తర్వాత తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెటుకున్నాడు. చంపటానికి గల కారణాలను కూడా ఈ వీడియోలో చెప్పాడు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో….పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చంపేసి వాట్సాప్ స్టేటస్….

భూపాలపల్లి జిల్లాలో దారుణం
భూపాలపల్లి జిల్లాలో దారుణం

ప్రాథమిక వివరాల ప్రకారం…. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచారి(50), సంధ్య దంపతులుగా ఉంటున్నారు. వీరి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య సంధ్యను ఉరి వేసి చంపేశాడు. తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఓ వీడియోను తన మొబైల్ లో వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు.

భార్య, కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపేసినట్లు ఆ వీడియో స్టేటస్ లో ఉంది. కష్టపడి పని చేసి డబ్బులు ఇస్తున్నప్పటికీ… తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ వీడియోలో రామాచారి చెప్పాడు. తనకు ఏమాత్రం విలువ ఇవ్వటం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భర్త ఇద్దరూ చనిపోవటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మొదటి భార్య చనిపోగా బాలరాజుచారి…. సంధ్యను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. చంపేసిన తర్వాత పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసిన బంధువులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe