హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్యాబ్ సర్వీసులకు సంబంధించిన ఒక విచిత్రమైన, ఆందోళన కలిగించే విషయం ప్రస్తుతం రెడ్డిట్ (Reddit) వేదికగా వైరల్ అవుతోంది. తెల్లవారుజామున ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి క్యాబ్‌లు బుక్ చేసుకుంటే, డ్రైవర్లు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఒక నగరవాసి తన అనుభవాన్ని వివరించారు. ఈ మొత్తం ఏకంగా రూ. 5,000 వరకు ఉండటం కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?

ఫ్లైట్‌లో వెళ్లాల్సిన ఒక ప్రయాణికుడు తెల్లవారుజామున 7 గంటలకు ఫ్లైట్ ఉండగా, సరిగ్గా 4 గంటలకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలను ఆయన రెడ్డిట్‌లో ఇలా పంచుకున్నారు.
"నేను క్యాబ్ బుక్ చేశాక, డ్రైవర్ కాల్ చేసి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. 'ఎయిర్‌పోర్ట్' అని చెప్పగానే, అతను ఆశ్చర్యపోయినట్లుగా మాట్లాడి, 'కొంచెం అదనంగా సర్దుబాటు చేయాలి' అన్నాడు. నేను 'యాప్‌లో చూపించిన ధర చెల్లిస్తాను' అని జవాబిచ్చాను.
అయితే, డ్రైవర్ ఒప్పుకోలేదు. "రూట్ సమస్యలు, ఆలస్యాలు ఉంటాయని" ఏదో చెప్పి, చివరకు ఏకంగా ₹5,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. నేను నిరాకరించిన తర్వాత, ఇతర క్యాబ్ డ్రైవర్ల నుంచి కూడా ఇలాంటి ప్రవర్తనే ఎదురైంది..’ అని వివరించారు.
ఒక్కరిది కాదు, అందరిదీ అదే కథ..
"ఇదే కథ ఇతర క్యాబ్ డ్రైవర్ల విషయంలోనూ పునరావృతమైంది. వారు ఎయిర్‌పోర్ట్ డ్రాప్‌కి రూ. 2,000 నుంచి రూ. 6,000 వరకు డిమాండ్ చేశారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అందుకే, చివరకు నేను నా స్నేహితుడిని అడిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. దారిలో కొంచెం ట్రాఫిక్ ఉన్నా, అతను నన్ను త్వరగానే డ్రాప్ చేశాడు" అని ఆ యూజర్ రాసుకొచ్చారు.
నగరంలో క్యాబ్‌లకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో ఏమైనా అసాధారణ సమస్యలు తలెత్తుతున్నాయా? లేక "తక్షణమే మరో క్యాబ్ దొరకదని తెలిసి, డ్రైవర్లు కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నారా?" అని ఆయన ఇతర నగరవాసులను ప్రశ్నించారు.
రెడిట్‌లో నెటిజన్ల ఫైర్
{{/usCountry}}నగరంలో క్యాబ్‌లకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో ఏమైనా అసాధారణ సమస్యలు తలెత్తుతున్నాయా? లేక "తక్షణమే మరో క్యాబ్ దొరకదని తెలిసి, డ్రైవర్లు కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నారా?" అని ఆయన ఇతర నగరవాసులను ప్రశ్నించారు.
రెడిట్‌లో నెటిజన్ల ఫైర్
{{/usCountry}}"ఉదయం పూట హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి క్యాబ్ ధరలు ఇంత పిచ్చిగా ఎవరైనా ఎదుర్కొంటున్నారా?" అనే శీర్షికతో ఈ చర్చ మొదలైంది. ఇది తక్కువ సమయంలోనే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను, అభిప్రాయాలను చాలా మంది పంచుకున్నారు.
ఒక నెటిజన్ స్పందిస్తూ, "ఇది కేవలం దురాశ, ఇంకేమీ కాదు. ఫైవ్ థౌజండ్ అంటే మరీ ఎక్కువ. ఏడు వేల రూపాయల ఫ్లైట్‌కి, ఐదు వేల రూపాయలు క్యాబ్ ఛార్జ్ అడుగుతున్నారా?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరొకరు "ఇది ఒక స్కామ్. నేను చాలాసార్లు ఈ డిమాండ్లను ఎదుర్కొన్నాను. వారితో వాదనకు దిగి సమయం వృథా చేసుకోవద్దు. రైడ్ రద్దు చేసి, వెంటనే మరొకటి బుక్ చేసుకోండి" అని సలహా ఇచ్చారు.
"ఇది పచ్చి మోసం. తెల్లవారుజామున అస్సలు ట్రాఫిక్ ఉండదు" అని మరొక యూజర్ ఖండించారు. కొందరు ప్రత్యామ్నాయ సేవలను సూచిస్తూ, "MMT (MakeMyTrip) ఎయిర్‌పోర్ట్ క్యాబ్ బుకింగ్ సేవను నేను వాడటం మొదలుపెట్టాను. అది అద్భుతంగా ఉంది" అని పేర్కొన్నారు.
డ్రైవర్లు గ్రూప్ చాట్‌ల ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారని మరికొందరు ఆరోపించారు. "వీరంతా గ్రూపుల ద్వారా కనెక్ట్ అయ్యారు. విమానంలో ప్రయాణించే వారు ధనవంతులు అని, వారికి సమయం చాలా విలువైనది కాబట్టి వేచి ఉండలేరని తెలిసి, అందరూ కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులను వేధించాలని నిర్ణయించుకున్నారని నేను అనుకుంటున్నాను" అని ఒక యూజర్ తీవ్ర ఆరోపణ చేశారు. "ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని మరొకరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
(నిరాకరణ: ఈ కథనం సోషల్ మీడియాలో యూజర్లు పంచుకున్న కంటెంట్ ఆధారంగా రూపొందింది. ఇందులో పేర్కొన్న వాదనలను స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఈ నివేదికను లేదా వాదనలను ఎవరూ బలపరచడం లేదు.)