...
...
Next Story

Hyderabad Crime News : జిమ్ టాయిలెట్‌లో మహిళపై లైంగిక దాడి - కోచ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

సైబరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో 2017లో నమోదైన లైంగిక దాడి కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పును వెలువరించింది. 39 ఏళ్ల జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 8 వేల జరిమానా విధించింది.

Published on: Nov 28, 2026, 09:50:54 IST
Advertisement

సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన లైంగిక దాడి కేసులో 39 ఏళ్ల జిమ్ కోచ్‌కు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు నిందితుడికి రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష (Pixel Image)
జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష (Pixel Image)

హైదరాబాద్ మెహదీపట్నం జ్యోతినగర్‌కు చెందిన మహ్మద్ మక్దూమ్ అలీ కుమారుడు మహ్మద్ మౌజమ్ అలీని దోషిగా కోర్టు తేల్చింది. 77/2017 క్రైమ్ నంబరు కింద నమోదైన కేసులో ఐపీసీలోని 376, 448, 506, 354(డీ)(ఐ) సెక్షన్ల కింద అతనిపై నేరం రుజువైంది.

ఫిర్యాదులో కీలక అంశాలు

గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న నిందితుడిపై 40 ఏళ్ల మహిళ 2017 ఫిబ్రవరి 13న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం…. 2015 జనవరి నుంచి జిమ్‌లోని మహిళల టాయిలెట్‌లో తనపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత తన ఫ్లాట్‌లోకి అక్రమంగా చొరబడి పలుమార్లు లైంగిక వేధింపులకు, బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు.

తనతో పాటు భర్త పరువు తీస్తామని బ్లాక్‌మెయిల్ చేశాడని బాధితురాలు తెలిపారు. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి తన ఫొటోలు తీశాడని ఫిర్యాదులో వెల్లడించారు. వేధింపులు భరించలేక 2017 ఫిబ్రవరి 11న భర్తకు ఈ విషయాలన్నీ చెప్పానని, అనంతరం ఫిబ్రవరి 13న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించానని వివరించారు.

దర్యాప్తు.. కోర్టు తీర్పు

కేసులో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన ఎల్‌బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం. వాణి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. విచారణ సమయంలో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు అధికారి, రాయదుర్గం సీఐ డి. దుర్గాప్రసాద్, గ్రేడ్-1 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. మంజుల దేవి కృషి చేశారని పోలీసులు తెలిపారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks