ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసాలు.. తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ రిక్వెస్ట్

MBBS Seat Alert : మెడికల్ సీట్ల పేరిట మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Published on: May 2, 2026, 10:04:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్ యూజీ పరీక్ష నేప‌థ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మీ పిల్లలకు నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని లేదా ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని నమ్మబలికే దళారుల మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు.

మెడికల్ సీట్ల పేరుతో మోసాలు
మెడికల్ సీట్ల పేరుతో మోసాలు

'గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల వల్ల ఎందరో తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏదైనా విదేశీ యూనివర్సిటీకి వెళ్లాలనుకునే ముందు, ఆ కాలేజీకి భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో గానీ లేదా మీరే స్వయంగా సంప్రదించి తెలుసుకోవాలి.' అని సజ్జనార్ అన్నారు.

అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వకండి, ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా సంబంధిత యూనివర్సిటీ లేదా కాలేజీ బ్యాంక్ ఖాతాలకే చెల్లించాలని హైదరాబాద్ సీపీ తెలిపారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి సాధించిన ఫలితాలను, మీ భవిష్యత్తు కలలను ఈ నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి ఆందోళనకు గురికావద్దన్నారు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

'ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే సంకోచించకుండా డయల్ 100 కి సమాచారం ఇవ్వండి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీ పిల్ల‌ల‌ను డాక్ట‌ర్లుగా చూడాల‌నే ఆశ‌తో మోసగాళ్ల మాయమాటల ఉచ్చులో పడకండి.' అని సజ్జనార్ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More