Malkajgiri Police Commissioner : హైదరాబాద్ పోలీసింగ్ లో సరికొత్త చరిత్ర - మల్కాజిగిరి తొలి మహిళా సీపీగా సుమతి
Malkajgiri Police Commissioner Sumathi : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పోలీసింగ్ చరిత్రలో ఒక కమిషనరేట్‌కు నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళా కమిషనర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.
Malkajgiri Police Commissioner Sumathi : హైదరాబాద్ నగర పోలీసింగ్ చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పురుష అధికారులే ప్రాతినిధ్యం వహించిన కమిషనర్ హోదాలో…. ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ సుమతి మీడియాతో మాట్లాడుతూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. "హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్‌గా నియమితులవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటాను" అని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు శాంతియుత ప్రాంతంగా మంచి పేరుందని…. ఆ ప్రతిష్టను మరింత పెంచేలా తన పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.
టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్
అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటూ 'క్వాలిటీ పోలీసింగ్'కు పెద్దపీట వేస్తామని కమిషనర్ సుమతి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల స్పందన వేగంగా ఉండేలా చూస్తామని… ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
"మల్కాజిగిరి ప్రాంతంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం" అని ఆమె తెలిపారు. దీంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ఆమె హెచ్చరించారు. సైబర్ క్రైమ్ బాధితుల ఫిర్యాదులను స్వీకరించడంలో వాటిపై స్పందించడంలో (Response) వేగాన్ని, నాణ్యతను పెంచుతామని వివరించారు.
కమిషనరేట్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరం ఒక టీమ్ లాగా పనిచేసి మల్కాజిగిరి కమిషనరేట్ పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడదామని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా, సామాన్య ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని నయా బాస్ సుమతి స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

