న్యూ ఇయర్‌కు హైదరాబాద్ మెట్రో టైమింగ్ పొడిగింపు.. మెట్రోలో మద్యం తీసుకెళ్లొచ్చా?

హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలు సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో సైతం సర్వీసుల సమయాన్ని పొడిగించింది. మరోవైపు చాలా మంది మెట్రోలో మద్యం తీసుకెళ్లవచ్చా? అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

Updated on: Dec 30, 2025, 17:44:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ నగరం రెడీ అయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగిస్తున్నట్టుగా ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడుస్తుంది. కానీ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో తెలిపింది. పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడించింది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

అయితే హైదరాబాద్ మెట్రోలో మద్యం తీసుకెళ్లవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది. దీనిపై ఆరా తీస్తున్నారు. నిజానికి హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల భద్రతాకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. భద్రతా పరంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. బస్సు, రైల్వేతో పోల్చితే మెట్రో నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఈ విషయంలో హైదరాబాద్ మెట్రో చాలా స్పష్టంగా ఉంటుంది.

ఇక మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా అనే విషయంపై చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ మెట్రో జారీ చేసిన నిబంధనల ప్రకారం రెండు సీల్ చేసిన మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చు. కాస్త ఓపెన్ చేసి ఉన్నా.. వాటిని అనుమతించరు అని మెట్రో నిషేధిత జాబితాలో ఉంది. కానీ తర్వాత వచ్చిన వార్తల ప్రకారం మద్యం బాటిళ్లకు అనుమతి లేదు. ఈ విషయంపై గందరగోళం నెలకొంది. దీనిపై HT Telugu హైదరాబాద్ మెట్రో కస్టమర్ కేర్ సర్వీస్‌కి కాల్ చేసింది. సీల్ చేసి ఉన్న రెండు బాటిళ్లకు మాత్రమే అనుమతి ఉందని కస్టమర్ సర్వీస్ వెల్లడించింది.

అయితే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మద్యం బాటిళ్లను మెట్రోలో తీసుకెళ్లకపోవడమే మంచిది. మెట్రో రైలు ప్రాంగణంలో ప్రవేశించే ప్రతీ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఎలాంటి నిషేధిత వస్తువు ఉన్నా.. అనుమతి ఉండదు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తాగి మెట్రోలో వెళ్లడం కూడా మంచిది కాదు. తాగి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే.. మెట్రో కఠినమైన చర్యలు తీసుకుంటుంది.

మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించడం నేరంగా చూస్తారు. స్టేషన్ ప్రాంగణంలో, రైలు లోపల మద్యం సేవించడంనేరం. మెట్రో చట్టం ప్రకారం.. ఇలాంటి పనులు చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ విషయంలో సీరియస్‌గా ఉంటారు.

మెట్రోలో ఇతరులతో గొడవలు పడటం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం కూడా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. సీసీ కెమెరా ద్వారా వెంటనే గుర్తిస్తారు. చర్యలు తీసుకుంటారు. మద్యం మత్తులో ఊగుతూ వెళ్తే.. రైలు ఎక్కనివ్వరు. ప్రతీ స్టేషన్లో భారీగా సిబ్బంది ఉంటారు. ప్రయాణికుల భద్రతకు హైదరాబాద్ మెట్రో అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

తుపాకులు, కత్తులు, పెంపుడు జంతువులు, మండే వస్తువులు, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలను మెట్రోలో అనుమతి ఇవ్వరు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.

ఈ లింక్ క్లిక్ చేసి హైదరాబాద్ మెట్రో నిషేధిత వస్తువుల జాబితా చదవండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More