హైదరాబాద్ మెట్రో టేకోవర్ పై సర్కార్ కీలక నిర్ణయం - డెడ్‌లైన్ ఫిక్స్!

హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. 2026 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ కొనసాగాలని అధికారులకు సూచించారు.

Published on: Dec 17, 2025, 07:40:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. ఎల్ అండ్ టీ అధికారులతో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.టేకోవర్ తాజా స్థితిని సమీక్షించిన ఆయన…ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా బదిలీ సజావుగా మరియు వేగంగా జరగాలని ఉద్ఘాటించారు.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

100 రోజుల ప్లాన్….

ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. రాబోయే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన విధానాలను క్రమపద్ధతిలో తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎల్ అండ్ టి పూర్తి సహకారం అందించాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎంఆర్ ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీతో పాటు ప్రభుత్వ తరుపు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశను ఎల్ అండ్ టీ గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కూడా కుదిరింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.13,000 కోట్ల రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీకి 90 శాతం ఈక్విటీ ఉంది.

రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు పొందడం కోసం మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ ప్రాజెక్టు అప్పు 13 వేల కోట్లు తన మీద వేసుకొని…. ఎల్‌ అండ్‌ టీ ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో 2,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే టేక్ ఓవర్ ప్రాసెస్ కొనసాగుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More