మహిళా భద్రతకు హైదరాబాద్ మెట్రో మరో ముందడుగు - విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!
మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.20 మంది ట్రాన్స్ జెండర్ సిబ్బందిని నియమించింది. వీరికి శిక్షణ పూర్తి కాగా… డిసెంబర్ 1వ తేదీ నుంచి విధుల్లో చేరారు.
హైదరాబాద్ మెట్రో రైలు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 20 మంది ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సేవల్లో చేర్చుకున్నట్లు ప్రకటించింది. ఇండక్షన్ సెక్యూరిటీ శిక్షణ పూర్తయిన తరువాత 20 మందిని ఎంపిక చేసింది. ఆయా సిబ్బందిని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లతో పాటు మెట్రో రైళ్లలో విధులు నిర్వర్తించడం ప్రారంభించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
"ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సిబ్బందిలోకి చేర్చడం సామాజిక సాధికారత మరియు సమ్మిళితత్వానికి బలమైన చిహ్నంగా నిలుస్తుంది. మెట్రో రైలు వ్యవస్థపై మహిళల భద్రత మరియు ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు" అని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.
కొత్తగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది… మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లతో పాటు ఇతర సాధారణ కోచ్‌లలోనూ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడం, మార్గనిర్దేశం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం వంటి బాధ్యతలను వారు నిర్వహిస్తారు.
హైదరాబాద్ మెట్రో రైలు మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో నడుస్తుందని… రోజుకు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికుల ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఇందులో 30 శాతం మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 39 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిన సంగతి తెలిసిందే.
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు:
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యం ప్రారంభమైంది. ఈ నిర్ణయం నవంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. వీటిలో మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హై-టెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయి.లాకర్ పై క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేసి సైజ్ వివరాలను తెలుసుకోవచ్చు. పేమెంట్ చేసి మీకు తగిన లాకర్ ను ఏంచుకోవచ్చు. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ లిమిటెడ్, టక్కీట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. http://www.tuckit.in/ వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

