...
...
Next Story

పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల దోపిడీలు - అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్, ఖమ్మం పోలీసులు కలసి జరిపిన ఉమ్మడి ఆపరేషన్‌లో అంతర్‌రాష్ట్ర నేరస్తుల ముఠాను పట్టుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేయగా… రూ.22 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Published on: Sep 20, 2026, 09:14:58 IST
Advertisement

పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల షట్టర్లు లేపి దోపిడీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22 లక్షల నగదు, మూడు నాలుగు చక్రాల వాహనాలు మరియు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం వెల్లడించారు.

పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల దోపిడీలు
పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల దోపిడీలు

హైదరాబాద్ నగర పోలీసులు, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన ఈ ముఠా గుట్టును రట్టు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

"కంబైన్డ్ ఆపరేషన్‌లో భాగంగా పశువుల దొంగతనాలు, సెల్ ఫోన్ షాపుల షట్టర్లు లేపి చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేశాం. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల నగదు, మూడు కార్లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం," అని సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వివరించారు.

ఈ ముఠా మొదట్లో పశువుల దొంగతనాలకు పాల్పడేదని…. ఆ తర్వాత క్రమంగా మొబైల్ షాపుల్లో భారీ చోరీలకు శ్రీకారం చుట్టిందని సీపీ తెలిపారు. పశువుల దొంగతనాలకు సంబంధించి వీరిపై దాదాపు 13 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత మొబైల్ షాపుల దోపిడీలకు అలవాటు పడ్డారని సీపీ పేర్కొన్నారు.

జైలులోనే పరిచయం.. అక్కడ నుంచి నేరాలు

ఈ కేసులోని ప్రధాన నిందితులు మహమ్మద్ తబ్రేజ్, రఫీక్‌లకు నేర చరిత్ర ఉందన్నారు. తబ్రేజ్‌పై గతంలో దాదాపు 37 కేసులు ఉండగా, ఇటీవల మరో 13 కేసులు నమోదయ్యాయి. ఒక ఎన్డీపీఎస్ (గంజాయి/మత్తు పదార్థాల) కేసులో చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో అబు అలియాస్ ఫైసల్‌తో వీరికి పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. జైలు నుంచి విడుదలయ్యాక వీరంతా కలిసి గుజరాత్‌లోని సూరత్‌లో చోరీకి యత్నించారని, అయితే వాహన ప్రమాదం జరగడంతో ఆ ప్రయత్నం విఫలమైందని సజ్జనార్ తెలిపారు.

ఇదే సమయంలో…. పోలీసు శాఖ అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ గురించి సీపీ సజ్జనార్ వివరించారు. బాధితులు తమ ఫిర్యాదులను ఏ భాషలోనైనా సులభంగా ఇచ్చేలా హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లలో ‘ట్రయాజ్ యూనిట్’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

"పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా తమ సొంత మాటల్లో చెప్పుకునేలా ఈ ట్రయాజ్ యూనిట్ పనిచేస్తుంది. ఇది తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ సహా తొమ్మిది రకాల భాషలకు సపోర్ట్ చేస్తుంది. బాధితులు చెప్పిన స్టేట్‌మెంట్‌ను వెంటనే రికార్డ్ చేసి రిసెప్షన్ కానిస్టేబుల్‌కు పంపుతాం. అక్కడ అదనపు వివరాలు సేకరించి, ఆన్‌లైన్ ద్వారా ఎస్ఐ అడ్మిన్‌కు నివేదిస్తాం. వారు తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు కేసును కేటాయిస్తారు" అని సీపీ వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks