హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్‌ల పేరుతో అమాయకులను ముంచుతున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోవాలోని ఒక రిసార్ట్‌లో కంపెనీ ఈవెంట్ నిర్వహిస్తుండగా దాడి చేసిన పోలీసులు ఐదుగురు ప్రతినిధులను అరెస్ట్ చేశారు. నిందితులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారి నుంచి మూడు లగ్జరీ వాహనాలతో పాటు పలు కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మోసం వెనుక పెద్ద కుట్రే ఉంది. జూలై 16న బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో జిమ్ ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం వెతుకుతుండగా, సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరు అతడికి పరిచయమయ్యాడు. వ్యాపార ప్రతిపాదన పేరుతో జూలై 9న బాధితుడిని బెంగళూరుకు పిలిపించారు. అక్కడ క్యూనెట్ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సంస్థను విలాసవంతమైన వస్తువుల వ్యాపారంగా పరిచయం చేశారు.
నకిలీ విజయగాథలు, వీడియో ప్రెజెంటేషన్లతో నమ్మించిన నిందితులు, బాధితుడిపై ఒత్తిడి తెచ్చి ఏకంగా రూ. 7.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత గోవాలో జరగబోయే లీడర్‌షిప్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు, స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు తక్షణమే రూ. 30,000 బుకింగ్ మొత్తం చెల్లించాలని నిబంధన పెట్టారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తాన్ని నిందితుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. కాగా, నిందితులు రాతపూర్వక మెసేజ్‌లను ప్రోత్సహించకుండా, కేవలం ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్‌లు మాత్రమే నిర్వహిస్తూ తీవ్ర గోప్యత పాటించాలని ఒత్తిడి తెచ్చారు.
గోవా రిసార్ట్‌లో స్పెషల్ ఆపరేషన్
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్యూనెట్ ప్రతినిధులు ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం జూలై 18న గోవాలోని రిసార్ట్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.
న్యాయపరమైన ప్రక్రియల అనంతరం నిందితులను గోవాలోని మపుసా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించేందుకు న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ మంజూరు చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
క్యూనెట్ మాయలో పడకండి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
{{/usCountry}}న్యాయపరమైన ప్రక్రియల అనంతరం నిందితులను గోవాలోని మపుసా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించేందుకు న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ మంజూరు చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
క్యూనెట్ మాయలో పడకండి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
{{/usCountry}}ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. క్యూనెట్ లేదా ఇతర మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), పిరమిడ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టవద్దని, ప్రచారం చేయవద్దని స్పష్టం చేశారు.
"క్యూనెట్ వంటి నకిలీ సంస్థలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఇస్తామని, పాసివ్ ఇన్‌కమ్ వస్తుందని ఆశచూపి ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, గృహిణులు మరియు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటాయి. తెలిసీ తెలియక ఇటువంటి చట్టవిరుద్ధమైన పథకాలకు ప్రచారం చేసినా, నిధులు సేకరించినా 'ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978' ప్రకారం తీవ్రమైన క్రిమినల్ చర్యలు తప్పవు" అని పోలీసులు హెచ్చరించారు.
గతంలో గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ పేర్లతో కార్యకలాపాలు సాగించిన హాంకాంగ్ ఆధారిత క్యూఐ గ్రూప్, భారతదేశంలో 'విహాన్ డైరెక్ట్ సెల్లింగ్' పేరుతో క్యూనెట్ బ్రాండ్‌ను నడుపుతోంది. దీనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.