ప్రభుత్వ భూమిలో నిర్మాణం... పైగా ఫేక్ LRS పత్రాలు..! 5 అంతస్తుల భవనాన్ని కూల్చేసిన హైడ్రా
అక్రమ నిర్మాణాలపై హైడ్రొ కొరడా ఝలిపిస్తోంది. శనివారం మియాపూర్ లో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.
హైదరాబాద్ లోని మియాపూర్లో నిర్మించిన ఓ అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని శనివారం కూల్చివేసింది. ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించటంతో చర్యలు తీసుకుంది.

హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలను నిర్మించారు. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడ్డారు. 126/D , 126/ part, 126/C గా ప్లాట్లను సృష్టించారు.
మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. ఫేక్ LRS సృష్టించటమే కాకుండా… LRS కోసం డబ్బులు చెల్లించినట్టు డీడీ కూడా ఫేక్ ది సృషించారని హైడ్రా అధికారులు వివరించారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని తొలగించారు. ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది. HMDA అధికారులు ఫిర్యాదు చేయటంతో ఈ కూల్చివేతలు జరిగాయి.
స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలోంచిన హైడ్రా అధికారులు… ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించుకుంది. 2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు తేల్చింది. అన్నీ పరిశీలించిన తర్వాతే…. శనివారం అక్రమణలను తొలగించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

