హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం, వివరాలు

హైదరాబాద్‌ నగర వాసులకు జలమండలి అధికారులు అలర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 27వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 

Published on: Oct 26, 2025, 09:04:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్…! రేపు (అక్టోబర్ 27) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఈ పనుల్లో సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది.

మంచినీటి సరఫరా నిలిపివేత (image source @IPRTelangana)
మంచినీటి సరఫరా నిలిపివేత (image source @IPRTelangana)

మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎంఎస్ పైప్​లైన్​ను స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేస్తారు. కాబట్టి అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి.

ఏ ఏ ప్రాంతాలంటే..?

ఈ పనుల కారణంగా… నల్లగుట్ట, ప్రకాశ్ నగర్, మేకలమండి, భోలక్​పూర్, హస్మత్​పేట తదితర ప్రాంతాలు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. అంతేకాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే, బేగంపేట విమానాశ్రయం, బాలంరాయి పంప్​హౌస్, బాలంరాయి చెక్ పోస్ట్, బోయిన్ పల్లి, ఏవోసీ రైల్వే కాలనీ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.

నీటి సరఫరా నిలిచిపోవటంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి, హెచ్ఎండీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More