బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషినని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జులై 1 విచారణ జరపనుంది.

25 ఏళ్ల సాయి భగీరథ్.. తాను చదువుతున్న మహీంద్రా యూనివర్సిటీలో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు పోక్సో కోర్టు నుండి వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ పొందాడు. పరీక్షలు ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం జూన్ 25న తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారంలో అధికారుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.
హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో 17 ఏళ్ల తన మైనర్ కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణలో భాగంగా మే 12న ఈ కేసులో తీవ్రమైన లైంగిక దాడి సెక్షన్లను జోడించారు. బాధితురాలిపై పదే పదే దాడికి పాల్పడినందుకు సంబంధించిన కఠినమైన పోక్సో నిబంధనలను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు.
మరోవైపు సాయి భగీరథ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. బాధితురాలి కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, అందుకు తాను నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ రూ. 5 కోట్లు డిమాండ్ (Extortion) చేశారని ఆరోపిస్తూ ఆయన ఎదురు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. తర్వాత బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఇక తాజాగా మరోసారి బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పూర్తిగా నిర్దోషిని. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాను.' ఈ క్రమంలో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ పేర్కొన్నారు.
{{/usCountry}}ఇక తాజాగా మరోసారి బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పూర్తిగా నిర్దోషిని. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాను.' ఈ క్రమంలో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ పేర్కొన్నారు.
{{/usCountry}}