ఆమెతో ఏడాది నుంచి క్లోజ్‌గా ఉన్నా.. వీడియోలు ఉన్నాయ్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి

ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కోసం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకుముందు అతడు రాసిన లేఖ బయటకు వచ్చింది.

Published on: Jul 20, 2026, 20:10:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ పరిధిలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదు, తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఆయన లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

ఉదయ్ కృష్ణారెడ్డి (Facebook)
ఉదయ్ కృష్ణారెడ్డి (Facebook)

హైదరాబాద్ శివార్లలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, తన బ్యాచ్‌మేట్ అయిన ఉదయ్‌కృష్ణారెడ్డిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అకాడమీలో ఉదయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మోతీనగర్‌లోని తన బంధువుల నివాసానికి వచ్చిన ఉదయ్‌కృష్ణారెడ్డి, శానిటైజర్ తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన రాసిన ఒక లేఖ లభ్యమవడంతో ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు.

ఉదయ్‌కృష్ణారెడ్డి శానిటైజర్ తాగిన వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురై ఆయనను వెంటనే ఎస్‌ఆర్‌ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లేఖలోని అంశాలు నిజమేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఐపీఎస్ ట్రైనీ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువు కొనసాగించారు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ సాధించటమే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 4సార్లు ఫెయిల్ అయినా ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించారు. ట్రైనింగ్ త్వరలో ముగించుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More