మంగళవారం (జులై 7, 2026) నాడు తెలంగాణలోని 13 జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

రాబోయే ఏడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకారం, జూలై 6 నుంచి జూలై 13 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అడపాదడపా కురుస్తాయి. జూలై 6-7 కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాతి చాలా రోజులలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
జులై 7న మిగిలిన జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. జూలై 8వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లోని అక్కడక్కడా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, రోడ్లు జారడం, చెట్లు కూలిపోయే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు కూడా అంతరాయం కలగవచ్చు.
రాబోయే 24 గంటల పాటు హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 'నగరంలో బలమైన ఉపరితల గాలులతో కూడిన తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 24 డిగ్రీల సెల్సియస్ చుట్టూ నమోదయ్యే అవకాశం ఉంది.' అని వాతావరణ శాఖ బులెటిన్ పేర్కొంది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు మెరుపులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, తీరప్రాంత ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌పై ఏర్పడిన అల్పపీడనం కొద్దిగా బలహీనపడి, ప్రస్తుతం దక్షిణ జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది.
{{/usCountry}}తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు మెరుపులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, తీరప్రాంత ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌పై ఏర్పడిన అల్పపీడనం కొద్దిగా బలహీనపడి, ప్రస్తుతం దక్షిణ జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది.
{{/usCountry}}