...
...
Next Story

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లేటెస్ట్ వెదర్ అప్‌డేట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. పిడుగులు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. మరో 48 గంటలు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.

Published on: Jun 13, 2026, 07:43:48 IST
Advertisement

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను వాతావరణం అయోమయానికి గురిచేస్తోంది. భిన్నమైన వాతావరణం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం ఎండ దంచికొట్టగా.. రాత్రివరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాల రాకతో కొన్ని ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత, వడగాల్పులు జనాన్ని బేజారెత్తిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడనున్నాయి.

మరోవైపు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చందానగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, మియాపూర్, కేపీహెచ్‌బీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, సరూర్‌నగర్, ఉప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్ వంటి పలు ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, రాత్రి వేళ ఇళ్లకు వెళ్లే ఆఫీస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ వానలు

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వూంతనాల్లో గానీ నిలబడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe