...
...
Next Story

Weather Update : రాబోయే వారం రోజులు తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Update : రాబోయే వారం రోజులకు సంబంధించిన వాతావరణ అప్డేట్‌ను ఐఎండీ విడుదల చేసింది. మరికొన్ని రోజులు తెలంగాణలో వర్షాలు లేవని తెలిపింది.

Published on: Aug 26, 2026, 15:27:15 IST
Advertisement

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం కారణంగా గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో కొంత వర్షం కురిసింది. అయితే ఆగస్టు 27 నుంచి వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అడపాదడపా జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది లేదా పొడిగా ఉండవచ్చు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వాతావరణం

రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి వారం వరకు, బహుశా సెప్టెంబర్ మొదటి 15 రోజుల వరకు కూడా వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు భారత వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని మాత్రం తెలిపింంది.

ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం, తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉత్తర హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 27 నుంచి వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులో కూడిన వానలు పడే అవకాశం ఉంది.

ఈ ప్రాంతంలోని కొన్ని భాగాలలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చు. గురువారం కూడా అక్కడక్కడా ఇలాంటి పరిస్థితులే కొనసాగవచ్చు. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా అక్కడక్కడా8 ఇలాంటి పరిస్థితులే ఏర్పడవచ్చు. ఆగస్టు 27, 28వ తేదీల్లో కోస్తాంధ్ర, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులు కూడా పడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe