IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, తెలంగాణ వాతావరణం ఇలా
IMD Rain Alert : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం పడనుంది.
పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్రమైంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 నుండి 48 గంటల్లో తూర్పు, మధ్య భారతదేశ తీర ప్రాంతాల్లో వాతావరణం గణనీయంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా సముద్ర మట్టం, తీర ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది. వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వరకు వీచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరప్రాంతాలపై ఆగస్టు 24 వరకు ఈ అల్పపీడన ప్రభావం ఉండనుంది. రాబోయే 48 గంటల్లో సముద్రం బాగా అల్లకల్లోలంగా మారనుంది. ప్రమాదకరమైన ఎగసిపడే అలలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రమాదకరంగా మారినందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఐఎమ్‌డీ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు తీరప్రాంతంలో ఉన్న ప్రధాన ఓడరేవులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. వాతావరణ శాఖ ఈ అల్పపీడన కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీరప్రాంత నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో రాబోయే వారం రోజులు అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు బలమైన గాలులతో కూడిన జల్లులు కురుస్తాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 3-4 రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
తెలంగాణ వాతావరణం
ఆగస్టు 23, 24 తేదీల్లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పడే వానలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఆగస్టు 24 నుంచి 26 మధ్యలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వచ్చి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


