IMD Weather Update : రాబోయే ఐదారు రోజులు వాతావరణం అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 23 రోజున రాష్ట్రంలోని ఐదు ప్రధాన జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందనడంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

Published on: Aug 22, 2026, 19:32:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల వాతావరణ సూచనలు, హెచ్చరికల బులేటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ వర్షాలు
తెలంగాణ వర్షాలు

23వ తేదీన ఉదయం 08:30 నుండి 24వ తేదీ ఉదయం 08:30 వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావచ్చు.

ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది.

24వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మంతో సహా రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి.

25వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.

26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు పడే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది, ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు చేసే వాహనదారులు, రోడ్లపై నీరు నిలిచే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ప్రయాణించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే శ్రేయస్కరమని జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More