ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ హామీల అమలులో భాగంగా 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.

రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారికంగా వెల్లడించారు. పారదర్శకమైన పద్ధతిలో ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ (డిస్కం) సంస్థల్లో ఈ క్రింది విధంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంస్థల వారీగా ఖాళీల వివరాలు
ఏపీట్రాన్స్‌కో-200 పోస్టులు
ఏపీజెన్‌కో -100 పోస్టులు
ఏపీఈపీడీసీఎల్-135 పోస్టులు
ఏపీఎస్‌పీడీసీఎల్-134 పోస్టులు
ఏపీసీపీడీసీఎల్-60 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెలికాం)తోపాటు ఇతర పోస్టులు ఉన్నాయి. జూన్ 30 నుంచి జూలై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ నియామకాల్లో పలు విభాగాల ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యత దక్కుతుంది. ఏపీ జెన్‌కో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కలిపి 80 పోస్టులను, సివిల్ విభాగంలో 20 పోస్టులను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో 167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కొత్త నియామకాల ద్వారా విద్యుత్ సంస్థల పనితీరు మరింత మెరుగవుతుందని, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఈ ఇంజనీర్ల భర్తీ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందరూ ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


