IMD Weather Update : తెలంగాణకు వర్ష సూచన.. రెండ్రోజులు విస్తారంగా వానలు.. ఐఎండీ అలర్ట్!
IMD Weather Update : తెలంగాణలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. రెండ్రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
రుతుపవనాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పుంజుకుంది. రుతుపవన ద్రోణి తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, వాతావరణం చల్లబడనుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తుంపర్లుగా వానపడుతూనే ఉంది. సాయంత్రానికి చల్లని గాలులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియరెన్స్ పనులను చేపట్టాయి. శుక్రవారం
ఉత్తర తెలంగాణలో పలు పజిల్లాల్లో వానలు ఎక్కువగా పడనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎల్‌నినోపై అప్రమత్తం
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఏర్పాటు చేసిన 27 మంది నిపుణుల కమిటీ తొలి సమావేశం ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది.
భారత వాతావరణ శాఖ(IMD), ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఐఐఎంఆర్, ఐఐఓఆర్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 30 శాతం వర్షపాతం లోటు నమోదైందని, 33 జిల్లాల్లో 23 జిల్లాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయని సమావేశంలో వెల్లడించారు.
జిల్లా, మండలాల వారీగా వర్షపాతం, పంటల విస్తీర్ణం, వాతావరణ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయ విశ్లేషణ చేపడుతున్నట్లు కమిటీ తెలిపింది. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, శాస్త్రీయ సూచనలతో ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొవచ్చని కమిటీ అభిప్రాయపడింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


